Group 1 Main Exam| గ్రూప్-1 మెయిన్స్ ప్రశ్నల్లో తప్పులు..
Group 1 Main Exam| గ్రూప్-1 మెయిన్స్ ప్రశ్నల్లో తప్పులు..
రెండో రోజు పరీక్షకు 69 శాతం హాజరు
HYDERABAD | అభ్యర్థులకు తప్పని ఇబ్బందులు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో మూడు ప్రశ్నల్లో అక్షర దోషాలు, అచ్చు తప్పులు దొర్లాయి. వ్యాసరూప ప్రశ్నలు కావడంతో సమాధానాలు రాసేందుకు అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. రెండో రోజు మంగళవారం జరిగిన జనరల్ ఎస్సే పేపర్‌కు 31,383 మంది అభ్యర్థులకు బదులుగా 21,817 (69.4శాతం) హాజరయ్యారైనట్లు టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. అయితే మెయిన్స్ పరీక్షలకు 10 వేల మంది డుమ్మాకొట్టడం గమనార్హం. ప్రశ్నలు కఠినంగా ఉన్నట్టు కొందరు తెలుపగా, మరికొందరు మాత్రం సులభంగా ఉన్నట్టు తెలిపారు. ఈ విధంగా పరీక్షలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 పేపర్ తరహాలోనే ఇక్కడ ప్రశ్నలు ఉన్నట్టు నిపుణులు విశ్లేషించారు.
*జనరల్ ఎస్సే పేపర్ ప్రశ్నపత్రంలో తప్పులివే..
మొదటి ప్రశ్నలో సామాజిక అసమానతా(త)లను అభి(ధి) గమించడానికి అనే దోషాలు.
వాతావరణ మార్పులు తగ్గించడంలో పునరుత్పాదక ఇంధన (వనరుల) పాత్రను వివరించండి అన్న ప్రశ్నలో వనరుల అన్న పదం లేదు.
మరో ప్రశ్న చిత్రీకరణకు చిత్రికరణ వచ్చింది.
* * *
Leave A Comment